చెన్నై: గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health update ) ఇంకా విషమంగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి మేనేజ్‌మెంట్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టు 5న బాలుకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని తేలడంతో చికిత్స నిమిత్తం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో.. ఐసీయూలోకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వెల్లడించింది. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 లోగో మారిందోచ్.. కొత్త లోగో ఇదే
ఇదిలావుండగా.. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టుగా తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఎంజిఎం హాస్పిటల్ పేర్కొంది. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సపోర్ట్‌తో ( ECMO support ) చికిత్స అందిస్తున్నట్టుగా వెల్లడించిన ఆసుపత్రి.. మెరుగైన వైద్యం కోసం జాతీయ, అంతర్జాతీయ నిపుణులైన డాక్టర్లను సంప్రదిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకుంటూ ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఎస్.పి. బాలు కరోనాను ఓడించి పూర్తి ఆరోగ్యంతో మన మధ్యలోకి తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. Also read : MS Dhoni reply to PM Modi: ప్రధాని లేఖపై స్పందించిన ధోనీ
SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్య పరిస్థితి