ప్రముఖ గాయకురాలు ఎమ్మెస్ రాజేశ్వరి మృతి

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకున్న గాయనీమణి ఎమ్మెస్ రాజేశ్వరి.

Last Updated : Apr 25, 2018, 08:36 PM IST
ప్రముఖ గాయకురాలు ఎమ్మెస్ రాజేశ్వరి మృతి

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకున్న గాయనీమణి ఎమ్మెస్ రాజేశ్వరి. ఈ రోజు ఆమె చెన్నైలో మరణించారు. గతకొంతంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. ఆమెకు 87 సంవత్సరాలు. 1947లో తొలిసారిగా "నమ్మ ఇరువర్" అనే సినిమాతో రాజేశ్వరి గాయకురాలిగా తన కెరీర్ ప్రారంభించారు. ఎక్కువగా ఏవీఎం స్టూడియోస్ బ్యానరులో వచ్చే సినిమాల్లో ఆమె పాడారు.

కేజే ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, టీఎం సౌందర్‌రాజన్ లాంటి గాయకులతో జతకట్టి రాజేశ్వరి ఎన్నో మధురగీతాలను ఆలపించారు. దాదాపు 500  సినిమాల్లో పాటలు పాడిన రాజేశ్వరి కేవీ మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, శంకర్ గణేష్, ఇళయరాజా లాంటి వారి సంగీత దర్శకత్వంలో కూడా అనేక గీతాలను ఆలపించారు. ముఖ్యంగా చిన్నారుల గొంతులకు పాడడంలో రాజేశ్వరి ఒక ప్రత్యేకతను కలిగుండేవారు.

బేబీ షామిలీ నటించిన అనేక సినిమాల్లో ఆమెకు రాజేశ్వరి పాటలు పాడారు. జీవితం, సంఘం, కలిసిన మనసులు, లక్ష్మీ దుర్గ, సింధూరదేవి లాంటి తెలుగు చిత్రాలు రాజేశ్వరికి తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో పేరు తీసుకొని వచ్చాయి. ఇక తమిళంలో ఆమెతో పనిచేయని సంగీత దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మలయాళం, కన్నడంలో కూడా పలు చిత్రాలకు పాటలు పాడారు రాజేశ్వరి. 2013లో జరిగిన భారతీయ సినిమా శతాబ్ది వేడుకల్లో తమిళనాడు ప్రభుత్వం రాజేశ్వరిని ప్రత్యేకంగా సన్మానించింది. 

Trending News