'శీలవతి'గా కనిపించనున్న షకీలా 

                                               

Last Updated : Aug 2, 2018, 04:06 PM IST
'శీలవతి'గా కనిపించనున్న షకీలా 

శృంగార నటిగా పేరుగాంచిన టాలీవడ్ నటి షకీలా ..ఇక సరికొత్త పాత్రలో తెరపైకి కనిపించనుంది. గత కొన్నేళ్లుగా మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకులను మోప్పిస్తున్న షకీలా .. మరో అడుగు ముందుకు వేసి 'శీలవతి'గా కనిపించేందుకు రెడీ అవుతోంది. అదేనండి షకీల ప్రధాన పాత్రలో నటించిన 'శీలవతి' మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా రాఘవ ఎం గణేష్ , వీరు బాసింశెట్టిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

షకీలా 250వ చిత్రం

ఉత్కంఠ కలిగేలా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు దాసరి సాయిరాం పేర్కొన్నారు. ఈ సినిమా చూసిన వారంతా ఇంతకు ముందు షకీలా వేరు.. ఇప్పటి షకీలా వేరు అని అంటారని వెల్లడించారు. కాగా ఈ సినిమా షకీలాకు 250వ చిత్రం కావడం గమనార్హం. దీనిపై షకీలా స్పందిస్తూ తన కెరీలో ఇన్ని చిత్రాలు నటించే అవకాశం రావడం పట్ల సతోషం వ్యక్తం చేసింది.

Trending News