షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు. రూపంలో అచ్చం తన తండ్రినే పోలే ఈ 20 ఏళ్ళ నవ యువకుడు ఇటీవలే జరిగిన అంబానీ కొడుకు నిశ్చితార్థ వేడుకలో దాదాపు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల నిశ్చితార్థ కార్యక్రమానికి తన తండ్రి షారుఖ్, తల్లి గౌరీలతో కలిసి వచ్చిన ఆర్యన్ గురించే అందరూ ఈవెంట్‌లో మాట్లాడుకున్నారని టాక్.
ఇదే ఈవెంట్‌కు రేఖ, అనిల్ కపూర్, రణ్ బీర్ కపూర్, విద్యా బాలన్, అలియా భట్, అర్జున కపూర్, మాధురీ దీక్షిత్ లాంటి నటీనటులందరూ హాజరయ్యారు. కాగా, ఆర్యన్ మాత్రం నిజంగానే ఆ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడని పలువురు అంటున్నారు. ఆ కార్యక్రమంలో తన తల్లిదండ్రులతో కలిసి ఆర్యన్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.