సమంత 'యూ టర్న్‌' కర్మ థీమ్ సాంగ్ రిలీజ్

సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'యూ టర్న్‌'.

Last Updated : Sep 3, 2018, 05:18 PM IST
సమంత 'యూ టర్న్‌' కర్మ థీమ్ సాంగ్ రిలీజ్

సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'యూ టర్న్‌'. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలు ఉండవట. ఒక ఫ్లై ఓవర్ వద్ద వరసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ చేసే జర్నలిస్ట్‌లా సమంత ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమె తనకు తెలియకుండానే అనేక సమస్యల్లో ఇరుక్కుంటుంది. ఆ సమస్యల నుండి ఆమె ఎలా బయటపడిందో తెలియజేసేలా దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

యూ టర్న్‌ చిత్రం ఏకకాలంలో తెలుగు, తమిళంలో నిర్మించారు. రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక ఇతర పాత్రల్లో నటించారు. రెండు భాషల్లో ఒకే రోజు (సెప్టెంబర్ 13) ఈ సినిమా విడుదల కానుంది.

సెప్టెంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి.. మూవీ ప్ర‌చారంలో భాగంగా చిత్ర యూనిట్ ఓ సాంగ్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాసిన ఈ పాట‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ ర‌విచంద్ర‌న్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్‌లో అనిరుథ్ పాటకు సమంత చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ & వివై కంబైన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మీరూ ఈ సాంగ్‌ను చూడండి.

Trending News