Mercy Killing: ప్రతి మహిళ చూడాల్సిన మూవీ మెర్సి కిల్లింగ్.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సాయికుమార్

Mercy Killing Pre Release Event: ఏప్రిల్ 12న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది మెర్సి కిల్లింగ్ మూవీ. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక కీలక పాత్రలు పోషించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2024, 02:51 PM IST
Mercy Killing: ప్రతి మహిళ చూడాల్సిన మూవీ మెర్సి కిల్లింగ్.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సాయికుమార్

Mercy Killing Pre Release Event: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మెర్సి కిల్లింగ్. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించాఉ. వేదుల బాల కామేశ్వరి సమర్పణలో రూపొందింది. ఏప్రిల్ 12న ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా.. ఎం.ఎల్.రాజా సంగీత దర్వకత్వం వహి్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. "మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసింది సినిమా మెర్సి కిల్లింగ్. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.." అని తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా మెర్సీ కిల్లింగ్‌ను తెరకెక్కించినట్లు డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు.  స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని చెప్పారు. అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందన్నారు. ఈ సినిమా కోసం అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని అన్నారు. సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందన్నారు.

==> నటీనటులు: సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.

సాంకేతిక నిపుణులు: 
==> బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్
==> దర్శకుడు: వెంకటరమణ ఎస్
==> ప్రొడ్యూసర్: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
==> సమర్పణ: వేదుల బాల కామేశ్వరి
==> సినిమాటోగ్రఫీ: అమర్.జి
==> మ్యూజిక్: ఎం.ఎల్.రాజ
==> ఎడిటర్: కపిల్ బల్ల
==> ఆర్ట్: నాయుడు
==> మాటలు: వై.సురేష్ కుమార్
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వి కడియం
==> లైన్ ప్రొడ్యూసర్: బాబీ శివకోటి

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

Also Read:  Heat Waves: రానున్న 3-4 రోజుల్లో ఈ జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News