గోల్డెన్ ఛాన్స్: ''సాహో'' ప్రభాస్‌తో పర్సనల్ మీట్; అది మీరే కావచ్చు !

సాహో రిలీజ్ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు గోల్డెన్ ఆఫర్ ప్రకటించాడు

Last Updated : Aug 28, 2019, 06:44 PM IST
గోల్డెన్ ఛాన్స్: ''సాహో'' ప్రభాస్‌తో పర్సనల్ మీట్; అది మీరే కావచ్చు !

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 'సాహో' రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా 'సాహో' సందడే కనిపిస్తోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే సాహో ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ కు ప్రభాస్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

ఇన్ స్టాగ్రమ్ వేదికగా "హాయ్ డార్లింగ్స్" అంటూ ఆప్యాయంగా పలకరించిన ప్రభాస్..ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ 'సాహో' మూవీ పోస్టర్ కనిపిస్తే ఓ సెల్ఫీ దిగి ఇన్ స్టాగ్రామ్ లో తనను ట్యాగ్ చేయాలంటూ పిలుపునిచ్చాడు. అలా ట్యాగ్ చేసిన వారిలో  కొందరు లక్కీ మెంబర్స్  ను ఎంపిక చేసి వారికి తనను కలిసే అవకాశం ఇస్తానని ప్రభాస్ వెల్లడించాడు.

ఇలా ప్రభాస్ కు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్  ఓ వీడియో రిలీజ్ చేశాడు సాహో ప్రభాస్. విన్నర్స్ ను వ్యక్తిగతంగా తానే ఎంపిక చేస్తానని అభిమానులకు తెలిపాడు. సో ఆ లక్కీ పర్సన్ మీరే కావొచ్చు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి..

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas) on

 

Trending News