Surgical strike : పాక్ పై పంచ్ డైలాగ్ విసిరిన సచిన్

                         

Last Updated : Feb 26, 2019, 05:57 PM IST
Surgical strike : పాక్ పై పంచ్ డైలాగ్ విసిరిన సచిన్

భారత వైమానిక దళాలు జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ పై రాజకీయ క్రీడా ప్రముఖలు స్పందిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రధాని మోడీ, చంద్రబాబు, వైఎస్ జగన్, వీరేంద్ర సెహ్వాగ్ , గౌతం గంభీర్ తదితరలు స్పందించగా ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా స్పందించారు.

భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ పై  సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా  స్పందిస్తూ భారత వాయుసేనకు సెల్యూట్ చెప్పారు. ‘మా మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దు. భారత వాయుసేన నా సెల్యూట్. జైహింద్’ అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారత సైన్య అంత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఈ రోజు తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సర్జికల్ స్ట్రైయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో భారత వైమానిక దశం బాంబుల వర్షం కురిపించగా 300 ఉగ్రవాదులను మట్టుబెట్టి పుల్వామా దాడికి నేడు భారత్ ప్రతీకారం తీర్చుకుంది  . ఈ నేపథ్యంలో భారత్ సైన్యానికి మద్దతు తెలుపుతూ సచిన్ ఈ మేరకు స్పందించాడు

Trending News