Credit Card Rules: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోయి ఫైన్‌తో కడుతున్నారా.. ఇక నుంచి అంతా చేంజ్‌ జీరో ఫైన్..

Rbi Changes Credit Card Rules: తరచుగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోతే ఈ వ్యాసాన్ని తప్పకుండా చదవాల్సి ఉంటుంది. బకాయలు చెల్లించే చివరి తేదీ కంటే మూడు రోజుల తర్వాత కూడా ఎలాంటి చార్జీలు లేకుండా బిల్లు చెల్లించవచ్చు ఈ అంశానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 01:19 PM IST
Credit Card Rules: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మర్చిపోయి ఫైన్‌తో కడుతున్నారా.. ఇక నుంచి అంతా చేంజ్‌ జీరో ఫైన్..

Rbi Changes Credit Card Rules: ప్రస్తుతం అందరూ డిజిటల్ పేమెంట్స్ తో బిల్లులు చెల్లిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్రతి ఒక్కరు డిజిటల్ విధానంలో బిల్లులు చెల్లించడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఒకే నెలలో అనేక బిల్లులు కలిపి చెల్లించడం అసౌకర్యంగా ఉంటుంది. చాలామంది ప్రస్తుతం క్రెడిట్ కార్డు విధానంలోనే బిల్లులు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు ఉన్నవారు నెల తర్వాత ఆ బిల్లులను కట్టడం మర్చిపోతున్నారు. ఒకవేళ బిల్లు కట్టడం మర్చిపోయిన చెల్లింపు తేదీ కంటే మూడు రోజుల వెనుక కట్టిన ఇకనుంచి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ చెల్లింపు కోసం మాత్రమే చార్జ్ చేయవచ్చు. అయితే బిల్లు చెల్లించే తేది కంటే మూడు రోజుల వెనక చెల్లిస్తే మీ క్రెడిట్ కార్డు పై పడిన అదనపు చార్జీలన్ని తిరిగి పొందవచ్చు. ఇది నిజమే దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?:
21 ఏప్రిల్ 2022న జారీ చేయబడిన క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన సూచనల ప్రకారం.. క్రెడిట్ కార్డ్ ఖాతాలో మూడు రోజుల కంటే ఎక్కువ బకాయి ఉన్నట్లయితే మాత్రమే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ ఛార్జీని విధించవచ్చని RBI పేర్కొంది. అయితే ఇలాంటి సందర్భంలో బిల్లును చివరి తేదీ వరకు చెల్లించకపోతే మూడు రోజుల తర్వాత కూడా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా చెల్లించుకోవచ్చని ఆర్బిఐ తెలుపుతోంది.

కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నారా..?:
 కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్నవారు చెల్లింపులు అన్నిటిని గడువు తేదీ కంటే మూడు రోజుల తర్వాత ఒకాయిలు మొత్తం చెల్లించుకోలేకపోతే అప్పుడు తప్పకుండా క్రెడిట్ కార్డు పై చార్జీలు విధిస్తుంది. చార్జీలన్నీ మీరు వినియోగించిన క్రెడిట్ బ్యాలెన్స్ ని బట్టి విధిస్తారని ఆర్బిఐ పేర్కొంది. 

ఉదాహరణకు..:
ఎవరి దగ్గరైనా SBI కార్డ్ కలిగి ఉండి, బకాయి ఉన్న మొత్తం రూ. 500 కంటే ఎక్కువ, రూ. 1000 కంటే తక్కువగా ఉంటే.. SBI కార్డ్ ఆలస్య రుసుము రూ. 400 వసూలు చేస్తారు. రూ.1,000 కంటే ఎక్కువ, రూ.10,000 కంటే తక్కువ ఉన్నట్లయితే, రూ.10,000, రూ.25,000 పైబడిన బ్యాలెన్స్‌కు రూ.950 వసూలు చేస్తారు. అయితే బిల్లు చెల్లించే చివరి తేదీ కంటే మూడు రోజులు ఎక్కువైనా ఎలాంటి అదనపు చార్జీలు క్రెడిట్ కార్డు పై పడవు. 

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ సినిమాకు టైటిల్ మార్పు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'గా వస్తున్న పవర్ స్టార్  

Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News