రజినీకాంత్ డిస్కవరీ షో ప్రోమో ఇదిగో..!!

సూపర్ స్టార్ రజినీకాంత్. . తొలిసారిగా టీవీ తెరపై కనిపించనున్న క్షణం రానే వచ్చేసింది.  డిస్కవరీ ఛానెల్‌లోని మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. 

Last Updated : Mar 1, 2020, 10:03 AM IST
రజినీకాంత్ డిస్కవరీ షో ప్రోమో ఇదిగో..!!

సూపర్ స్టార్ రజినీకాంత్. . తొలిసారిగా టీవీ తెరపై కనిపించనున్న క్షణం రానే వచ్చేసింది.  డిస్కవరీ ఛానెల్‌లోని మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో లో కనిపించబోతున్నారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. 

డిస్కవరీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ చేస్తున్న బేయర్ గ్రిల్స్... గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఓ ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఎపిసోడ్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్‌ను కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ అడవుల్లో చిత్రీకరించారు. జనవరిలో షూటింగ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ప్రసారం కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ క్షణం రానే వచ్చింది. ఈ ఎపిసోడ్‌ను మార్చి 23న రాత్రి 8 గంటలకు ప్రసారం చేస్తున్నామని డిస్కవరీ ఛానెల్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రోమోను ట్వీట్ చేసింది. బేయర్ గ్రిల్స్, సూపర్ స్టార్ రజినీకాంత్ సాహసాలు చూడండి అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

Read Also: రమణా.. 'మైండ్ బ్లాక్' వీడియో లోడ్ చేశార్రా..!!

మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎపిసోడ్ మోషన్ పోస్టర్‌ను బేయర్ గ్రిల్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తాను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్స్‌తో పని చేశానని.. కానీ ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యమని బేయర్ గ్రిల్స్ ట్వీట్ చేశారు. లవ్ ఇండియా  అంటూ రాశారు. సూపర్ స్టార్‌ను అడవుల్లో చూడడం ఆనందంగా ఉందని తెలిపారు.

Read Also: ఆలోపే రజినీకాంత్ చచ్చిపోతాడు..!!

Trending News