RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను బయటపెట్టిన రాజమౌళి

                        

Last Updated : Mar 14, 2019, 02:01 PM IST
RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను బయటపెట్టిన రాజమౌళి

RRR మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ రోజు నిర్వహించిన # RRR ప్రెస్‌మీట్లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ సినిమా కథాంశంతో పాటు మూవీకి సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కీ రోల్ ప్లే చేస్తారని దర్శకుడు రాజమౌళి వివరించారు.

కథాంశం ఇదే..
కథాంశం గురించి మాట్లాడుతూ  చరిత్రలో చిరకాలం పాటు నిలిచిపోయిన తెలుగు జాతీ వీరులు అల్లూరి సీతారామరాజు,  కొమరం భీమ్‌ల జీవిత కథ ను పరిగణనలోకి ఈ మూవీని తెరపైకి ఎక్కిస్తున్నామన్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్‌లో జన్మించిన ఈ ఇద్దరు మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని తనదైన శైలిలో ఈసినిమాను 1920 ఉత్తరప్రదేశ్ ప్రాంత నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు. 

రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఇవే
పాత్ర అంశాన్ని రాజ్ మౌళి ప్రస్తావిస్తూ... యంగ్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్  మరోవైపు యంగ్ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ నటిస్తున్నట్లు వెల్లడించారు.  ఇది పూర్తిగా  ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కించబోతున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. 

10 భాషల్లో మూవీ రిలీజ్
చారిత్రక సన్నివేశాలతో కూడిన  RRR మూవీని దేశవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. టైటిల్ గురించి స్పందిస్తూ తొలత RRR అనేది వర్కింగ్  టైటిల్ గా మాత్రమే భావించామని ..జనాల నుంచి  అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని RRR అన్ని భాషల్లోనూ అనువుగా ఉంటుందని అభిప్రాయానికి వచ్చామని రాజమౌళి వెల్లడించారు.

Trending News