Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' నుంచి రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన అజయ్ ఘోష్ స్టెప్పులు

Angrezi Beat Lyrical Video Song: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అంగ్రేజీ బీట్’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2024, 07:07 PM IST
Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' నుంచి రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన అజయ్ ఘోష్ స్టెప్పులు

Angrezi Beat Lyrical Video Song: ప్రస్తుతం ఆడియన్స్‌ సినిమాలను చూసే తీరు పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉండే చిత్రాలకే బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా కంటెంట్‌ను బేస్ చేసుకుని మరో మూవీ తెరకెక్కుతోంది. అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు శివ పాలడుగు దర్శకత్వం వహించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్, టీజర్‌ ఇలా అన్నీ కూడా మెప్పించాయి. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా సందడి మొదలుపెట్టనుంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. 

Also Read: Hyderabad Metro: జర్నీవేళల్లో  ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..

తాజాగా ఈ సినిమా నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ సాగే అదిరిపోయే బీటున్న సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించారు. ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం.. ఆయన స్టెప్పులు.. కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ సాంగ్‌ను మరింత స్పెషల్‌గా మార్చింది. మంచి హుషారైన బీటుతో ‘అంగ్రేజీ బీట్’ లిరికల్ వీడియో సాంగ్ అలరించేలా ఉంది. షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

యాక్టర్స్: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం
==> బ్యానర్: ఫ్లై హై సినిమాస్
==> ప్రొడ్యూసర్స్: హర్ష గారపాటి, రంగారావు గారపాటి
==> రచన, డైరెక్టర్: శివ పాలడుగు
==> మ్యూజిక్: పవన్
==> కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగం
==> ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
==> PRO: ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

 Read more: Vijayawada boy cpr: నువ్వు గ్రేట్ తల్లీ.... రోడ్డుపైన బాలుడికి సీపీఆర్ చేసిన లేడీ డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News