Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు

పూరి జగన్నాథ్‌కి ( Director Puri Jagannath ) తన కొత్త సినిమా ఫైటర్ హీరోయిన్ అనన్యా పాండే ( Actress Ananya Panday ) రూపంలో కొత్త కష్టాలు వచ్చేటట్టున్నాయి. విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  జంటగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Last Updated : Aug 27, 2020, 09:50 PM IST
Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు

పూరి జగన్నాథ్‌కి ( Director Puri Jagannath ) తన కొత్త సినిమా ఫైటర్ హీరోయిన్ అనన్యా పాండే ( Actress Ananya Panday ) రూపంలో కొత్త కష్టాలు వచ్చేటట్టున్నాయి. విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  జంటగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు చంకీ పాండేకి కూతురు అయిన అనన్య పాండేపై కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానుల ( Sushant Singh Rajput fans ) నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనన్యా పాండే హీరోయిన్‌గా చేస్తోన్న ఖాళీ పీలీ అనే హిందీ చిత్రం టీజర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఐతే ఈ టీజర్‌కి సుశాంత్ అభిమానుల నుంచి భారీ నిరసన సెగ తగులుతోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెపోటిజంను ( Nepotism in Bollywood ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుశాంత్ అభిమానులు.. అనన్యా పాండె కూడా సినీనటుడి కూతురే కావడంతో ఆమె నటించిన ఖాళీ పీలి చిత్రం టీజర్‌పై డిస్‌లైక్స్ బాదేస్తున్నారు. ఖాళీ పీలీ టీజర్‌పై ( Khaali Peeli teaser ) ఇప్పటికే 1.5 మిలియన్ డిజ్‌లైక్స్ నమోదయ్యాయి. Also read : Acharya controversy: ఆచార్య కథ కాపీనా ? స్పందించిన నిర్మాతలు

ఆలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్ ( Sadak 2 trailer ) సైతం ఇదే ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు 12 మిలియన్ల మంది ఆ చిత్ర ట్రైలర్‌ని డిజ్‌లైక్ చేశారు. ఇదిలావుండగా ఇప్పుడు ఖాళీ పీలి టీజర్ కూడా అదే బాటలో వెళ్తోంది. టీజర్ కాస్త భిన్నంగానే ఉన్నప్పటికీ.. దానికి డిజ్‌లైక్స్ మాత్రం తప్పడం లేదు. Also read : Pushpa movie: నా కథను కాపీ కొట్టారంటూ సుకుమార్‌పై ప్రముఖ రచయిత ఆరోపణలు

అనన్య పాండే నటిస్తున్న ఫైటర్ మూవీ ( Fighter movie ) హిందీలో కూడా విడుదల కానుండటంతో ఆమెపై వ్యక్తమవుతోన్న వ్యతిరేకత ఎక్కడ తన చిత్రంపై పడుతుందోననే భయం పూరి జగన్నాథ్‌ని పట్టుకున్నట్టు తెలుస్తోంది. అన్నింటికి మించి ఈ చిత్రానికి మరో సమస్య కూడా ఉంది. అదేమంటే.. ఇదే ఫైటర్ చిత్రాన్ని హిందీలో కరణ్ జొహర్ ( Karan johar ) ప్రజెంట్ చేస్తుండటం. అంటే.. కరణ్ జోహర్, అనన్య పాండే రూపంలో ఫైటర్ హిందీ వెర్షన్‌కి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also read : Ram Charan: రాంచరణ్ డ్రీమ్ ప్రాజెక్టు అదేనట

Trending News