ఇన్‌కమ్ టాక్స్ చిక్కుల్లో పడిన ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను ఇన్‌కమ్ టాక్స్ చిక్కులు వీడటం లేదు.

Last Updated : Jan 25, 2018, 11:37 PM IST
ఇన్‌కమ్ టాక్స్ చిక్కుల్లో పడిన ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను ఇన్‌కమ్ టాక్స్ చిక్కులు వీడటం లేదు. 2011లో ప్రియాంకా చోప్రా ఇంటిపై జరిగిన ఐటీ సోదాల్లో ఆమె ఇంట్లో రూ.27 లక్షల విలువ చేసే టొయోటా ప్రియస్ కారు, రూ.40లక్షల విలువ చేసే ఎల్వీఎంహెచ్ ట్యాగ్ వాచ్ లభించాయి. తన పర్‌ఫార్మెన్స్ మెచ్చి ఓ కంపెనీ ఇచ్చిన బహుమతులు అవి అని అప్పట్లో ఇన్‌కమ్ టాక్స్ అధికారులకి వాంగ్మూలం ఇచ్చిందామె. ఇవేకాకుండా ప్రియాంకా చోప్రా ఇంట్లో లభ్యమైన ఓ డైరీలో ఆమె జరిపిన ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా బయటపడ్డాయి. ఆయా ఖరీదైన బహుమతులకు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందిగా ఆదాయ పన్ను విభాగం అధికారులు ప్రియాంకా చోప్రాకు నోటీసులు జారీచేశారు. ఇదంతా 2011లో జరిగింది. ఆ తర్వాత ఆ నోటీసులని లైట్ తీసుకున్న ప్రియాంకా చోప్రా తనకు అందిన బహుమతులకి పన్ను చెల్లించలేదు.

ఇదిలావుండగా తాజాగా మరోసారి ఆదాయ పన్ను విభాగం అధికారులు మరోసారి ప్రియాంకా చోప్రాకు నోటీసులు జారీచేశారు. 2011లో అందుకున్న ఖరీదైన బహుమతులకిగాను పన్ను చెల్లించాల్సిందిగా ఆదాయ పన్ను విభాగం అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

Trending News