Prabhutva Junior Kalasala: వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు మూవీ డైరెక్టర్

Prabhutva Junior Kalasala Punganur 500143 Updates: ఈ నెల 21న ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 సినిమా ఆడియన్స్ ముందుకురానుంది. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను రూపొందించినట్లు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2024, 06:41 PM IST
Prabhutva Junior Kalasala: వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు మూవీ డైరెక్టర్

Prabhutva Junior Kalasala Punganur 500143 Updates: యధార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన ఈ సినిమాను బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 21న థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. తాజాగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. జూన్ 21న ఆ రోజు తమ జీవితాల్లో ఒక బిగ్ డే అనుకోవాలని.. ఎన్నో ఇబ్బందులు దాటి తమ సినిమాను రిలీజ్ వరకు తీసుకురావడమే పెద్ద విజయంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమా ఉంటుందని.. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. 

Also Read: Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదే

మనం ఉన్నా లేకున్నా సినిమా మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు శ్రీనాథ్ పులకురం. తాను పుట్టి పెరిగిన పుంగనూరును టైటిల్‌లో పెట్టి.. తన సొంతూరికి తన వంతుగా ఒక గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని చెప్పారు. డబ్బు కోసం తాను సినిమా చేయలేదని.. డబ్బు కావాలంటే ఎన్నో పనులు ఉన్నాయన్నారు. తనకు సినిమా అంటే ఇష్టం అని.. కానీ చాలా మందికి సినిమా అంటే వ్యాపారం అని అన్నారు. అలాంటి వారి వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఇవన్నీ దాటుకుని ఈ నెల 21న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నామన్నారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికి తమ పేరెంట్స్ గుర్తుకు వస్తారని అన్నారు.

ప్రొడ్యూసర్ భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. తనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయాలు లేవని.. ఈసినిమాతో నిర్మాతగా మారానని అన్నారు. మూవీ చిత్రీకరణలో దర్శకుడి శ్రీనాథ్‌కు సినిమా మీద ఉన్న కమిట్‌మెంట్ మరింతగా తెలిసిందన్నారు. ఆయన త్వరలో పెద్ద సినిమాలు తీస్తాడనే నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించారని చెప్పారు. 

హీరోయిన్  షాజ్ఞ మాట్లాడుతూ.. ఈ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ శ్రీనాథ్ తనతో మంచి పర్ఫార్మెన్స్ చేయించారని చెప్పారు. ఈ సినిమా కోసం అందరూ ఫ్యామిలీలా టీమ్ వర్క్ చేశామన్నారు. ఇలాంటి మంచి సినిమాను సపోర్ట్ చేయాలని కోరారు. హీరో ప్రణవ్ ప్రీతం మాట్లాడుతూ.. ఈ సినిమా తమకు చాలా స్పెషల్ అని.. సిటీలో పెరిగే తమకు పుంగనూరు వంటి అందమైన ఊరిలో షూటింగ్ చేయడం ఎంతో ప్లెజెంట్‌గా ఉండేందన్నారు. హీరోగా తనకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. 

Also Read: Sexual Assault: పోర్న్‌ చూస్తూ సొంత బిడ్డపై తండ్రి లైంగిక దాడి.. నాన్న అనే పేరుకే కళంకం వీడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News