Unstoppable: ప్రభాస్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. ఆ హీరో స్పెషల్ ఎంట్రీ!

Prabhas and Gopichand in Unstoppable with NBK 2: నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి మరో హీరో ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.   

Last Updated : Dec 2, 2022, 01:00 PM IST
Unstoppable: ప్రభాస్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. ఆ హీరో స్పెషల్ ఎంట్రీ!

Prabhas and Gopichand to Appear on Unstoppable with NBK 2: నందమూరి బాలకృష్ణ గత ఏడాది అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అనే ఒక టాక్ షో హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహా వీడియో యాప్ కోసం రూపొందించిన ఈ టాక్ షో సూపర్ హిట్ కావడంతో దానికి సంబంధించిన రెండవ సీజన్ కూడా ప్లాన్ చేశారు. రెండో సీజన్లో ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు విడుదలవగా దాదాపు అన్ని ఎపిసోడ్లు సూపర్ హిట్ అయ్యాయి.

నారా చంద్రబాబు నాయుడు- నారా లోకేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- సురేష్ రెడ్డి- రాధిక, విశ్వక్సేన్- సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్- శర్వానంద్ ఇలా అన్ని సూపర్ హిట్ కాంబినేషన్లు తీసుకురావడంతో అన్ని ఎపిసోడ్లు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి మరో స్టార్ అట్రాక్షన్ తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. హ్యపెనింగ్ హీరో ప్రభాస్ ఆయనకు అత్యంత సన్నిహితులుగా పేరు ఉన్న గోపీచంద్ ఇద్దరినీ ఒక ఎపిసోడ్ కోసం ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

వర్షం సినిమా సమయంలో ప్రభాస్ గోపీచంద్ మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా గోపీచంద్ విలన్ పాత్రలో నటించారు. ఇక వీరు మాత్రమే కాకుండా హీరోయిన్స్ జయప్రద, జయసుధ ఇద్దరితో కూడా ఒక ఎపిసోడ్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే ఇవి కాకుండా మరో ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రాఘవేంద్రరావు -కోదండరామిరెడ్డి -అల్లు అరవింద్ -దగ్గుబాటి సురేష్ బాబు కాంబినేషన్ లో ఒక ఎపిసోడ్ రూపొందించారు.

దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఈ రోజు నుంచి ఆహాలో ఉదయం 9 గంటల నుంచి శ్రీమౌతోంది. ఈ ఎపిసోడ్ గురించి కూడా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది. అయితే ప్రభాస్ తో ఎపిసోడ్ చేస్తే కనుక ప్రభాస్ అభిమానులు అందరూ కచ్చితంగా ఆదరిస్తారని భావిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతానికి మామూలుగా లేదు, కేవలం తెలుగు మాత్రమే కాదు ఆయన చేస్తున్న అన్ని సినిమాలు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
Also Read: HIT 2 Movie Review : హిట్‌ 2 రివ్యూ.. కోడి బుర్ర ఎవరిదంటే?

Also Read: Matti Kusthi Telugu Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. సరదాగా సాగే భార్యాభర్తల పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News