రజినీకాంత్ నటించిన పేట తెలుగు ట్రైలర్ స్నీక్ పీక్ వీడియో

పేట తెలుగు ట్రైలర్ స్నీక్ పీక్ వీడియో

Last Updated : Dec 31, 2018, 08:06 PM IST
రజినీకాంత్ నటించిన పేట తెలుగు ట్రైలర్ స్నీక్ పీక్ వీడియో

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, తమిళ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ స్నీక్ పీక్ ప్రోమో వీడియోను విడుదల చేశారు. ఈ స్నీక్ పీక్ వీడియో ద్వారా తన అభిమానులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన సూపర్ స్టార్.. వచ్చే సంక్రాంతికి మీ పేటలో మిమ్మల్ని కలుస్తాను అంటూ పరోక్షంగా థియేటర్లలో కలుద్దాం అనే హింట్ ఇచ్చాడు. సూపర్ స్టార్‌తోపాటు తమిళ స్టార్ విజయ్ సేతుపతి, త్రిష, సిమ్రాన్, నవాజుద్దిన్ సిద్ధిఖి, శశి కుమార్ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిర్మాత అశోక్ వల్లభనేని ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తుండగా ప్రముఖ యంగ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మరోసారి సూపర్ స్టార్ స్టామినాను ఆడియెన్స్‌కి మెస్మరైజ్ చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది.

Trending News