నిహారిక-సుమంత్ అశ్విన్‌ల 'హ్యాపీ వెడ్డింగ్'కి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్

తుది మెరుగులు దిద్దుకుంటున్న నిహారిక-సుమంత్ అశ్విన్‌ల 'హ్యాపీ వెడ్డింగ్' 

Last Updated : Jun 15, 2018, 12:37 PM IST
నిహారిక-సుమంత్ అశ్విన్‌ల 'హ్యాపీ వెడ్డింగ్'కి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, సుమంత్ అశ్విన్‌ జంటగా నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా హ్యపీ వెడ్డింగ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ చిత్రానికి తుదిమెరుగులు అద్దే పనిలో బిజీ అయ్యింది. అందులో భాగంగానే తాజాగా మేకర్స్ ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ సహాయం తీసుకుంటున్నారు. అవును ఫిదా ఫేమ్ శక్తికాంత దాస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ స్వయంగా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తొలుత ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నట్టు టాక్ వినిపించినప్పటికీ ఏ కారణం వల్లో అది సాధ్యపడలేదని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో లక్ష్మణ్ కర్య అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ సైతం ప్రకటించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

2016లో రిలీజైన ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన నిహారికకు ఆ సినిమా అంతగా హిట్‌ని అందివ్వలేకపోయింది. దీంతో ప్రస్తుతం నిహారిక ఆశలన్నీ హ్యాపీ వెడ్డింగ్ సినిమాపైనే ఉన్నాయి. హ్యాపీ వెడ్డింగ్ సినిమానైనా హ్యాపీ బిగినింగ్‌ని అందిస్తుందేమోననేది నిహారిక ఆశ. 

Trending News