మణిరత్నం 'నవాబు' నుంచి మరో ట్రైలర్ విడుదల

మణిరత్నం 'నవాబు' రెండో ట్రైలర్ విడుదల

Last Updated : Sep 22, 2018, 12:13 PM IST
మణిరత్నం 'నవాబు' నుంచి మరో ట్రైలర్ విడుదల

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్ చిత్రం 'నవాబ్ (చెక్క చివంద వానమ్‌)' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదరి వంటి స్టార్ హీరో, హీరోయిన్స్‌తోపాటు ప్రకాశ్ రాజ్, జయసుధ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఆగస్టులో సినిమా ఫస్ట్ ట్రైలర్ విడుదలై ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడ‌దులైన సాంగ్స్ ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ని తారాస్థాయికి తీసుకెళ్ళాయి. తాజాగా ఈ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది.

పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో అరవింద్‌,అరుణ్, విజయ్‌, శింబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వీరి మధ్య చోటుచేసుకుకొనే సంఘర్షణలే సినిమాకు కీలకమని తెలుస్తోంది. పొలిటీషన్‌గా అరవింద్ స్వామి, ఇంజనీర్‌గా శింబు .. పోలీస్ అధికారిగా విజయ్ సేతుపతి కనిపిస్తారట. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంగీతం: ఏ ఆర్ రెహ‌మాన్, సినిమాటోగ్రాఫ‌ర్‌: సంతోష్ శివ‌న్. సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంద‌ట‌.

Trending News