షాకింగ్ న్యూస్.. జేబులోనే పేలిన మొబైల్ ఫోన్ !

జేబులోనే పేలిన మొబైల్ ఫోన్.. సీసీటీవీలో రికార్డైన దృశ్యం

Last Updated : Jun 7, 2018, 11:44 AM IST
 షాకింగ్ న్యూస్.. జేబులోనే పేలిన మొబైల్ ఫోన్ !

ముంబైలోని భాండప్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన మొబైల్ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రెస్టారెంట్‌లో భోజనం చేస్తోన్న ఓ వ్యక్తి జేబులో ఉన్న ఫోన్ ఉన్నట్టుండి టైమ్ బాంబ్‌లా పేలిపోయింది. పై జేబులో ఉన్న ఫోన్ గుండెకు దగ్గరగా పేలడంతో అదిరిపడిన ఆ వ్యక్తి క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫోన్‌ని జేబులోంచి తీసి బయటపడేసి అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసే సమయం కావడంతో రెస్టారెంట్ కూడా రద్దీగానే వుంది. అనుకోని ఘటనతో షాకైన జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఆ హోటల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఫోన్ పేలడంతో వెలువడిన పొగ హోటల్ అంతా వ్యాపించింది. 

 

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్ ద్వారా విడుదల చేసింది.

Trending News