హైదరాబాద్ : ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేసిన ఆ గొంతు ఇక శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ (57) ( Mimicry artist Harikishan ) ఇక లేరు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాసవిడిచారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాలకృష్ణలతో పాటు ఈ తరం హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఎందరో స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడంలో హరి కిషన్ నెంబర్ 1 మిమిక్రీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. అంతేకాకుండా తెలుగునాట పేరొందిన రాజకీయ ప్రముఖులని కూడా హరి కిషన్ ఎంతో చక్కగా అనుకరించే వారు. ( Read also : క్యాన్సర్తో యువ నటుడి మృతి )
చాలామంది మిమిక్రీ ఆర్టిస్టుల్లా కేవలం సినీ, రాజకీయ ప్రముఖుల గొంతును అనుకరించడమే కాకుండా పశు పక్ష్యాదులు, యంత్రాలు చేసే శబ్ధాలను ఆయన తన గొంతుతో పలికించే వారు. సంగీత వాయిద్య పరికరాల శబ్ధాలను సైతం మిమిక్రీ చేసి తనకు తానే సాటి... లేరెవ్వరూ తనకు పోటి అనిపించుకున్నారు. 1963లో మే 30న ఏలూరులో జన్మించిన హరి కిషన్ 8 ఏళ్ల వయసులోనే మిమిక్రీ రంగంవైపు అడుగులు వేశారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి లాంటి వారికి ఎంతోమందికి ఆయనే గురువు. తెలుగు నాట ఎంతోమందికి సుపరిచితుడైన హరికిషన్ ఆకస్మిక మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..