రంగస్థలం సినిమా కథ లీక్ చేసిన చిరు..!

మార్చి 18 (ఆదివారం నాడు) విశాఖ వేదికగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. 

Last Updated : Mar 19, 2018, 05:24 PM IST
రంగస్థలం సినిమా కథ లీక్ చేసిన చిరు..!

మార్చి 18 (ఆదివారం నాడు) విశాఖ వేదికగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ఇదే ఈవెంట్‌లో ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ వేడుకకు మెగస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి పుత్రోత్సహాన్ని కనబరిచారు. ఈ క్రమంలో ఆయన సినిమా కథ గురించి చెబుతూ.. కొంతమేర కథనాన్ని కూడా చెప్పేశారు. ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందని.. అయితే కథ మాత్రం రాజకీయ కోణంలో ఉంటుందని చెప్పారు.

కుమార్ బాబు (ఆది), చిట్టిబాబు (రామ్ చరణ్) అన్నదమ్ములని.. తన అన్న కుమార్ చనిపోయాక.. చిట్టి ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే అని ఆయన అన్నారు. దాంతో ఈ సినిమా కూడా రివెంజ్ డ్రామా అన్న క్లూ చిరు ఇచ్చేసిట్లయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన
రంగస్థలం త్వరలోనే విడుదల కానుంది. 

Trending News