క్షమాపణ చెప్పిన ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్

యూజర్ల పర్సనల్ డిటెయిల్స్‌ను ఫేస్బుక్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు

Last Updated : Mar 25, 2018, 08:46 PM IST
క్షమాపణ చెప్పిన ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్

యూజర్ల పర్సనల్ డిటెయిల్స్‌ను ఫేస్బుక్ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ఓ ప్రకటనను విడుదల చేశారు. "యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత మాదే. అలా చేయలేకపోతే మేము మా అర్హతను కోల్పోయినట్లే భావిస్తున్నాము" అని జుకర్‌బర్గ్ ఆ ప్రకటనలో తెలిపారు.

ఇదే విషయానికి సంబంధించి గడచిన రెండు రోజుల క్రితం కూడా ఆయన క్షమాపణ తెలిపారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనాల్టికా, అనేక కోట్లమంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని తమ అవసరానికి వాడుకుందని వార్తలు రావడంతో పాటు... ఇదే విషయం నిమిత్తం పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఎప్పుడైతే ఇతర సంస్థలు ఫేస్బుక్‌లోని యూజర్ల సమాచారాన్ని వాడుకుంటున్నాయనే వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో.. పలు కంపెనీలు ఫేస్బుక్ నుండి తమ ఖాతాలను తొలిగించాయి. 

Trending News