మణికర్ణిక నుంచి తప్పుకున్న క్రిష్

మణికర్ణిక నుంచి తప్పుకున్న క్రిష్

Last Updated : Sep 3, 2018, 05:12 PM IST
మణికర్ణిక నుంచి తప్పుకున్న క్రిష్

వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా ద‌ర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌లో, సోనుసుద్ సదాశివ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు, దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతున్న సమయంలో.. సోనూసూద్, కంగనా రనౌత్‌ల మధ్య విభేదాలు తలెత్తడంతో సోనూ బయటికి వచ్చేశాడు. తాజాగా మణికర్ణిక దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ జాగర్లమూడి కూడా తప్పుకున్నాడు.

మణికర్ణిక మూవీ చిత్రీకరణ సమయంలో సోనూసూద్, కంగనా రనౌత్‌ల మధ్య విభేదాలు తలెత్తడంతో సోనూ స్థానంలో జీషాన్ ఆయుబ్‌ను తీసుకున్నారు. దీంతో కొన్ని యాక్షన్ సీన్లను రీషూట్ చేయాల్సి వచ్చింది. దీని కోసం రూ.20 కోట్ల వ్యయంతో 45 రోజుల రీషెడ్యూల్‌ను నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ క్రిష్ 'ఎన్టీఆర్' పనులతో బిజీగా మారడంతో 'మణికర్ణిక'కు కంగనా రనౌతే దర్శకత్వం వహిస్తోంది. కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్‌ను కూడా తీసుకొచ్చారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. శంకర్- ఎహసాన్- లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

Trending News