చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్; మజిలీ 3 వారాల కలెక్షన్స్ ఇవే

మజిలీ మూవీ చైతూ కెరీర్ లోనే  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది

Last Updated : Apr 29, 2019, 10:55 AM IST
చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్; మజిలీ 3 వారాల కలెక్షన్స్ ఇవే

అక్కినేని నాగ చైతన్య సమంత జంట కలిసి నటించిన మజిలీ మూవీ సూపర్ హిట్ అయింది.  ఇది చైతూ కెరీర్ లో ఈ మూవీ  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  ఇప్పటికి మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఇది యమ స్పీడ్ లో దూసుకెళ్తోంది. ఈ మూడు వారాల్లో మజిలీ సినిమాకు వరల్డ్ వైడ్  రూ. 62 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. వరుసగా మూడో వారం కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్ రావడం విశేషం.  ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 వారాల వసూళ్లు ఇలా ఉన్నాయి...

 మజిలీ 21 రోజుల షేర్ వివరాలు: 
నైజాం – రూ. 12.24 కోట్లు
సీడెడ్ – రూ. 4.15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.21 కోట్లు
ఈస్ట్ – రూ. 1.72 కోట్లు
వెస్ట్ – రూ. 1.32 కోట్లు
గుంటూరు – రూ. 2.04 కోట్లు
నెల్లూరు – రూ. 0.86 కోట్లు
కృష్ణా – రూ. 1.78 కోట్లు

ఈ మూవీ ఊపు ఇలాగే కొనసాగితే మరో వారంలో రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరినా ఆర్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Trending News