రాజశేఖర్ అప్‌కమింగ్ మూవీ కల్కి ఫస్ట్ అవతార్ టీజర్

కల్కి మూవీ టీజర్

Last Updated : Dec 31, 2018, 05:59 PM IST
రాజశేఖర్ అప్‌కమింగ్ మూవీ కల్కి ఫస్ట్ అవతార్ టీజర్

చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ మూవీతో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్న డా. రాజశేఖర్ హీరోగా ప్రస్తుతం కల్కి అనే మూవీ సెట్స్ పై వుంది. గరుడవేగ మూవీ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో వున్న రాజశేఖర్.. కల్కి సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ అవతార్ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రేపు జనవరి 1, నూతన సంవత్సరం సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఈ టీజర్ ద్వారా వెల్లడించారు. టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తే, రాజశేఖర్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటించినట్టు అర్థమవుతోంది.

Trending News