క్రేజీ డైరెక్టర్‌తో జూ.ఎన్టీఆర్ సినిమా

క్రేజీ డైరెక్టర్‌తో జూ.ఎన్టీఆర్ సినిమా

Last Updated : Oct 2, 2018, 05:15 PM IST
క్రేజీ డైరెక్టర్‌తో జూ.ఎన్టీఆర్ సినిమా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ మూవీ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇంతవరకు ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడా సినిమా పూర్తయింది. మరి ఆయన తదుపరి చిత్రం ఎవరితో..? అనేది తెలియాల్సి ఉంది. అయితే టాలీవుడ్‌లో కొత్తగా ఓ వార్త ఒకటి వినిపిస్తోంది. అదేమిటంటే..    

త‌మిళంలో బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అట్లీ.. ‘రాజా రాణి’, విజ‌య్‌తో 'మెర్సల్' వంటి చిత్రాలు తీసి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ కుర్ర డైరెక్టర్ క‌న్ను టాలీవుడ్‌పై పడిందో ఏమో గానీ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను త‌మిళ ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం చేసేందుకు సిద్దప‌డుతున్నాడని సమాచారం. మహానటి, దేవదాస్ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మాణంలో ఎన్టీఆర్‌తో కలిసి అట్లీ ఓ భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ట. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ మూవీ రూపొందనుందని... త్వర‌లోనే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రక‌ట‌న వెలువ‌డ‌నుందని సమాచారం.

మరోవైపు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ మల్టీస్టారర్‌లో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకాస్త టైం పడుతుండడంతో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట తారక్.

Trending News