"జంబలకిడి పంబ" టీజర్ విడుదల

1993లో వచ్చిన "జంబలకిడి పంబ" సినిమా గుర్తుందా..? దర్శకులు ఈవీవీ సత్యనారాయణ చేసిన ఆ మ్యాజిక్ ఎవరు మర్చిపోతారు చెప్పండి.

Last Updated : May 3, 2018, 09:29 PM IST
"జంబలకిడి పంబ" టీజర్ విడుదల

1993లో వచ్చిన "జంబలకిడి పంబ" సినిమా గుర్తుందా..? దర్శకులు ఈవీవీ సత్యనారాయణ చేసిన ఆ మ్యాజిక్ ఎవరు మర్చిపోతారు చెప్పండి. ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు ఆడవాళ్లుగా మారితే ప్రపంచం ఎలా ఉంటుందోనన్న చిలిపి కాన్సెప్ట్‌తో ఆయన తెరకెక్కించిన ఆ చిత్రం ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనకు తెలియంది కాదు. ఇప్పుడు ఆ పేరుతోనే మళ్లీ సినిమా తీస్తున్నారు దర్శకులు జేబీ మురళీ కృష్ణ.

శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో కథానాయకుడు కాగా, సిద్ధి ఇద్నానీ హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఈ చిత్ర టీజర్‌ను గురువారం యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ సినిమా టీజర్‌లో భార్య భర్తల మధ్య జరిగే చిలిపి తగాదాల గురించి, విడాకులు తీసుకోవాలనుకొనే ఆలుమగల మనస్తత్వాల గురించి తెలిపారు

శివమ్‌ సెల్యులాయిడ్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి, జోజో జోస్‌, ఎన్‌.శ్రీనివాసరెడ్డి, బి. సురేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, షకలక శంకర్‌, సత్యం రాజేశ్‌, ధనరాజ్‌, ప్రకాష్‌రెడ్డి, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Trending News