మనందరి ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ క్రాస్ అయింది. కేవలం మొబైల్ మాత్రమే కాకుండా డెస్క్ టాప్ వెర్షన్ కూడా పనిచేయకుండా ఆగిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా ‘సర్వర్ ఎర్రర్’ అంటూ సందేశం కనిపిస్తోంది. దీంతో భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుజర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఫోటో, వీడియో షేరింగ్ చేసుకోలేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు జోకులు పేల్చుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ క్రాస్ విషయం అటుంచి.. ఈ జోకులు చూసి కాసేపు సరదాగా నవ్వుకోండి.
when everyone realises that instagram is down #instagramdown pic.twitter.com/CkdvvihjfM
— lauren 👻 (@LaurenMcKenna92) October 3, 2018
Ok @instagram, you can wake up now. #instagramdown pic.twitter.com/k41IkTgjIi
— Elena Sanchez (@TheElenaSanchez) October 3, 2018
Me checking Instagram to see if it’s back up yet#instagramdown pic.twitter.com/vuyvvXEWRA
— Sean Kahle (@SeanKahle) October 3, 2018
When Instagram is down so you turn to Twitter for comfort 😂 ☕️ #instagramdown pic.twitter.com/mrFrOt99nx
— Jack and Alice (@Jack_and_Alice) October 3, 2018
ట్విట్టర్ వేదికగా ఈ స్థాయిలో యుజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ...తాజా క్రాష్ పై ఇన్ స్టాగ్రామ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను 2010 అక్టోబర్ లో ప్రారంభించారు. ఈ యాప్ ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ 2012లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇది పేస్ బుక్ అనుబంధ యాప్ గా కొనసాగుతోంది. కాగా 36 భాషల్లో లభ్యమవుతున్న ఈ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్నారు .