తన బాలీవుడ్ ప్రేయసి కోసం.. రూ.48 కోట్ల ఖరీదైన బంగ్లా కొన్నాడు

ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా బెస్ట్ జోడీగా కితాబునందుకుంటున్న జంట నిక్ జోనస్, ప్రియాంక చోప్రా.

Last Updated : Oct 25, 2018, 07:08 PM IST
తన బాలీవుడ్ ప్రేయసి కోసం.. రూ.48 కోట్ల ఖరీదైన బంగ్లా కొన్నాడు

ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా బెస్ట్ జోడీగా కితాబునందుకుంటున్న జంట నిక్ జోనస్, ప్రియాంక చోప్రా. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవలే జోనస్ తనకు కాబోయే భార్య కోసం దాదాపు 6.50 మిలియన్ డాలర్లు అనగా.. అక్షరాల రూ.48 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ విల్లా కొన్నాడట. పెళ్లయ్యాక.. ఇదీ బంగ్లాలో ఈ జంట కాపురం చేయడానికి నిశ్చయించుకుందట. డిసెంబరు 2018 నెలలో లేదా జనవరి 2019 నెలలో ఈ జంట పెళ్లి చేసుకోనుందని టాక్.

ప్రస్తుతం తన బాలీవుడ్ ప్రేయసైన ప్రియాంక కోసం జోనస్ కొనుగోలు చేసిన బంగ్లాలో 5 బెడ్ రూములు ఉన్నాయట. అలాగే పెద్ద స్విమ్మింగ్ పూల్, ఖరీదైన చెక్క కళారూపాలు, ప్రాచీన ఆర్కిటెక్చర్ మొదలైన  వాటితో ఆ బంగ్లా మంచి లుక్‌ని కలిగుందని వినికిడి. అయితే వీరిద్దరి పెళ్లి విషయానికి వస్తే మాత్రం.. వారు రాజస్థాన్‌లోని జోధ్ పూర్ ప్రాంతంలో సంప్రదాయ వివాహం చేసుకోవాలని భావిస్తున్నారట. ఆ పెళ్లి తర్వాత న్యూయార్క్‌లో మరోసారి జోనస్ తన స్నేహితుల సమక్షంలో ప్రియాంకని వివాహం చేసుకోనున్నారు. 

బాలీవుడ్‌లో అందాజ్, ఐత్ రాజ్, ఫ్యాషన్, కమీనే, 7 ఖూన్ మాఫ్, బర్ఫీ, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలలో..  నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రియాంక టైమ్స్ పత్రిక వారు ప్రకటించిన ప్రభావవంతమైన  మహిళల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. 2000లో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్న ప్రియాంక.. రామ్ చరణ్ నటించిన "జంజీర్"లో నటించారు. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా  పొందారు.

 

Trending News