Hit 3: హిట్ 3 కోసం దిమ్మతిరిగే కాంబినేషన్ సెట్.. అడివి శేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు?

Hit 3 Combination Set: ఇప్పటికే హిట్ విడుదలై, సూపర్ హిట్ అందుకోగా ఇప్పుడు హిట్ 2 రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇక ఇప్పుడు హిట్ 3 సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 22, 2022, 03:47 PM IST
  • అడివి శేష్ హీరోగా హిట్ 2
  • డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • హిట్ 3 గురించి అప్పుడే ఊహాగానాలు
Hit 3: హిట్ 3 కోసం దిమ్మతిరిగే కాంబినేషన్ సెట్.. అడివి శేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు?

Hit 3 Combination Set: ఈ మధ్యకాలంలో సినిమా చిన్నదా? పెద్దదా? బడ్జెట్ ఎక్కువా? తక్కువా? అనే విషయాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. భారీ బడ్జెట్ తో తీసిన బ్రహ్మాస్త్ర 300 కోట్లు సంపాదిస్తే కేవలం 14 కోట్ల రూపాయలతోనే తీసిన కాంతార సుమారు 400 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సంగతి తరువాత ముందు సినిమా కంటెంట్ బాగుండేలా చూసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అలా నాని నిర్మాతగా చేసిన హిట్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు శైలేష్ కొలను.

విశ్వక్ సేన్ హీరోగా రుహాని శర్మ హీరోయిన్ గా రూపొందిన హిట్ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ ఉంటుంది అని అప్పట్లోనే ప్రకటించారు. ఈ హిట్ 2 సినిమా కూడా వచ్చే నెల రెండవ తేదీ విడుదలవుతోంది. అడవి శేషు ప్రధాన పాత్రలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇక హిట్ 2 ప్రమోషన్స్ లో భాగంగా అడవి శేషు మాట్లాడుతూ తాను హిట్ 2లో భాగం అవ్వడానికి కారణం విశ్వక్సేన్ రాలేకపోవడం కాదని చెప్పుకొచ్చారు. ఈ హిట్ సీక్వెల్స్ అనుకుంటున్న సమయంలో ఒక్కో భాగానికి ఒక్కొక్కరిని హీరోగా తీసుకోవాలని అనుకున్నారని అందులో భాగంగా తనను ఈ సినిమాలో భాగం చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ హిట్ 3 గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే హిట్ 3లో అడవి శేష్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది.

హిట్, హిట్ 2 సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని హిట్ త్రి సినిమాలో కూడా భాగం కాబోతున్నారు. ఆయన నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా మూడవ భాగంలో భాగం కాబోతున్నారు. అంతేకాక ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ సేతుపతి కూడా నాని హిట్ త్రీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు హిట్, హిట్ 2 రెండూ భారతదేశం బ్యాక్ డ్రాప్ లో జరగగా హిట్ 3 మాత్రం అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే  ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News