High Blood Pressure: హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగితే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?

High Blood Pressure: హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీరు అస్సలు అల్లం టీలను తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరిలో జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2022, 02:13 PM IST
  • హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగడం వల్ల
  • తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
  • జీర్ణక్రియ సమస్యలు రావొచ్చు.
High Blood Pressure: హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగితే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?

High Blood Pressure: భారతదేశంలో టీ తాగే వారికి కొదవ లేదు. ఇప్పుడు టీలు, కాఫీలు తాగడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో విభిన్న రుచుల్లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ టీ తాగే క్రమంలో వివిధ రకాల స్నాక్స్‌ కూడా తీసుకుంటున్నారు. అయితే చాలా మంది సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి కేవలం అల్లం టీలను వినియోగిస్తారు. అల్లంలో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గుపై ప్రభావవంతంగా పని చేసి వీటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అయితే అల్లం చాయ్‌ని అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హైబీపీ పేషెంట్లు అల్లం టీ తాగొచ్చా..?:
హైబీపీ పేషెంట్లు అల్లం టీలను అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా టీలను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీరు ఈ టీలకు బదులుగా గ్రీన్‌ టీలను తాగొచ్చు. అల్లం టీలను తాగడం వల్ల అధిక రక్తపోటు ఉన్న వారు కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు కూడా రావచ్చు.

అల్లం టీ దుష్ప్రభావాలు:

1. జీర్ణక్రియ సమస్యలు:
క్రమం తప్పకుండా అల్లం టీలను తాగడం వల్ల జీర్ణ క్రయ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించడమేకాకుండా టీలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2. పొట్ట సమస్యలు:
అల్లం టీలను క్రమంగా తాగడం వల్ల పొట్టలో సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా పొట్టలో తీవ్ర మంటలు, వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు అల్లం టీలను తాగడం మానుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన

Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News