అభిమాని కోసం పోస్టర్లు అంటించిన హీరో..!

చాలామంది సినిమా హీరోలు అభిమానుల కోసం అప్పుడప్పుడు తమ స్థాయిని కూడా పట్టించుకోకుండా దిగివచ్చి మరీ వారి అనురాగాన్ని చూరగొంటారు. 

Last Updated : May 20, 2018, 09:33 PM IST
అభిమాని కోసం పోస్టర్లు అంటించిన హీరో..!

చాలామంది సినిమా హీరోలు అభిమానుల కోసం అప్పుడప్పుడు తమ స్థాయిని కూడా పట్టించుకోకుండా దిగివచ్చి మరీ వారి అనురాగాన్ని చూరగొంటారు. అలాగే అభిమానులు తమవల్ల ఏదైనా ఇబ్బందిలో చిక్కుకుంటే బాధపడతారు కూడా. ఇటీవలి కాలంలో తమిళనాడులో కూడా హీరో శింబు తన అభిమాని చనిపోతే ఆయనకు నివాళులు అర్పించడం కోసం దుబాయ్ నుండి వచ్చి మరీ పోస్టర్లు అతికించారు.

వివరాల్లోకి వెళితే చెన్నై వాసి అయిన మదన్ శింబుకి వీరాభిమాని. స్థానిక అభిమాన సంఘంలో ఆయన క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలే జరిగిన ఓ ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈ వార్తను తోటి అభిమానులు శింబు తండ్రి రాజేందర్‌కు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు శింబుకి తెలపగా.. ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.

తానే పర్సనల్‌గా ఆ అభిమాని ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరుకాలేకపోయినందుకు బాధపడుతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానికి నివాళుల అర్పిస్తూ.. పెద్దకర్మకు సంబంధించిన పోస్టర్లను తానే వీధుల్లోకి వెళ్లి స్వయానా అంటించారు. ఆ సందర్భంగా తీసిన పలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Trending News