/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

తాజాగా ఫేస్‌బుక్‌పై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. అకౌంట్ హోల్డర్ అనుమతి లేకుండా డేటాను దొంగలిస్తున్నారని అనేక మంది ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతో  గోప్యతకు సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్‌బుక్‌‌లో ఉన్నవారు దాంట్లో పోస్ట్ పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.

ఇదిలా ఉండగా.. మరోపక్క  ‘బీఎఫ్ఎఫ్’ పోస్టులు ఫేస్‌బుక్‌లో తెగ హడావుడి చేసేస్తున్నాయి. కామెంట్ బాక్సులో బీఎఫ్ఎఫ్ అని టైప్ చేస్తే.. అది ఆకుపచ్చ రంగులోకి మారుతుందని, అలా మారితే  మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ కానట్టు అని, మారకపోతే కచ్చితంగా ఫేస్‌బుక్ హ్యాక్ అయినట్టేనని పలు పోస్టులు ఫేస్‌బుక్ పేజీలో హాల్ చల్ చేస్తున్నాయ్..! అంతేకాదు, ఆ ఫీచర్‌ను ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గే స్వయంగా తయారు చేశారనీ వార్తలు వస్తున్నాయి. దీంతో కొందరు నెటిజన్లు నిజమే కాబోలు అనుకుంటూ... ‘బీఎఫ్ఎఫ్’ అని కామెంట్ బాక్స్ లో టైప్ చేసేస్తున్నారు.

అయితే, అదంతా ఓ ‘ఫేక్’ అని తేలిపోయింది. బీఎఫ్ఎఫ్ టెక్ట్స్ డిలైట్ (ఆనందం వ్యక్తం చేయడం) కోసం ఫేస్‌బుక్ సృష్టించింది. కామెంట్ బాక్సులో బీఎఫ్ఎఫ్ అని టైప్ చేయగానే రెండు యానిమేటెడ్ చేతులు అలా అలా పైకి వెళుతూ ‘హైఫై’ చెబుతుంది. తర్వాత అది ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. అయితే, ఫేస్‌బుక్ అప్‌డేటెడ్ వెర్షన్లలో మాత్రమే అది యానిమేట్ అవుతుంది. పాత వెర్షన్లలో మాత్రం మామూలుగానే ఉండిపోతుంది. అంతేతప్ప హ్యాకింగ్‌కు, భద్రతకు, బీఎఫ్ఎఫ్‌కు సంబంధమే లేదని ఫేస్‌బుక్ ధ్రువీకరించింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్న 'బీఎఫ్ఎఫ్'' వార్త ఫేక్ అని తేల్చేసింది.

Section: 
English Title: 
Green BFF 'security test' on Facebook is fake news
News Source: 
Home Title: 

'బీఎఫ్ఎఫ్' వార్త ఫేక్.. అసలు కారణం ఇదీ.!

'బీఎఫ్ఎఫ్' వార్త ఫేక్.. తేల్చిచెప్పిన ఫేస్‌బుక్‌
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
'బీఎఫ్ఎఫ్' వార్త ఫేక్.. అసలు కారణం ఇదీ.!