బులియన్ మార్కెట్‌లో నవంబర్ నెలలో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెల ప్రారంభంలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తూ ధర తగ్గింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.340 మేర తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,764కి పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,700 అయింది.
ఢిల్లీ మార్కెట్‌లో సైతం గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. బంగారం ధరలు (Gold Price in Delhi) వరుసగా డిసెంబర్ ఆరంభంలోనూ దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.350 మేర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,100 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.310 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.67,850కి క్షీణించింది.
Also Read : SBI PO Recruitment 2020: ఎస్‌బీఐలో భారీగా పీఓ పోస్టులకు నోటిఫికేషన్
బులియన్ మార్కెట్‌లో నవంబర్ నెలలో వెండి ధరలు క్షీణించాయి. తాజాగా డిసెంబర్ ఆరంభంలోనూ వెండి ధర పతనమైంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.900 మేర భారీగా దిగొచ్చింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.58,300కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో వెండి ట్రేడింగ్ జరుగుతుంది.
Also Read : Fast Internet Tips: మీ మొబైల్ ఇంటర్నెట్ స్లో అయిందా.. ఈ టిప్స్ పాటించండి
Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe