Petrol-Diesel Price Hike: దేశంలో మరోసారి పెరగనున్న ఇంధన ధరలు, సంకేతాలిచ్చిన ఐవోసీఎల్

Petrol-Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి పెరగనున్నాయని తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఈ దిశగా సంకేతాలిచ్చింది. నష్టాల్నించి తేరుకునేందుకు ఇంధన ధరలు పెంచవచ్చని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2022, 06:20 PM IST
Petrol-Diesel Price Hike: దేశంలో మరోసారి పెరగనున్న ఇంధన ధరలు, సంకేతాలిచ్చిన ఐవోసీఎల్

Petrol-Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి పెరగనున్నాయని తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఈ దిశగా సంకేతాలిచ్చింది. నష్టాల్నించి తేరుకునేందుకు ఇంధన ధరలు పెంచవచ్చని తెలుస్తోంది. 

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గేలే కన్పించడం లేదు. పెట్రోల్- డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో ఇంధన ధరలు మరోసారి పెంచే సూచనలున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన చూస్తే తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీకు లీటర్ పెట్రోల్‌పై 10 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 14 రూపాయల చొప్పున నష్టం కల్గినట్టు ప్రకటించింది. ఒక త్రైమాసికంలో నష్టం కలగడం కంపెనీకు గత రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థకు 2022-23 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1992.53 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోవైపు గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయానికి 5941.37 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. జనవరి-మార్చ్ త్రైమాసికంలో 6021.9 కోట్ల రూపాయల లాభం కలిగింది. కంపెనీ ఆదాయంలో నష్టానికి కారణం పెట్రోల్, డీజిల్ అమ్మకాల మార్జిన్‌లో తగ్గింపని కంపెనీ వెల్లడించింది. ప్రొడక్షన్ ట్యాక్స్ కూడా తగ్గించడం మరో కారణమని తెలిపింది. ఇతర పెట్రోలియం కంపెనీలు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరల్ని సవరిస్తుంటే..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీలు ధరలు పెంచలేదని నివేదికలో పేర్కొంది. 

Also read: Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది, ఎప్పట్నించి, ఆఫర్లు ఎలా ఉన్నాయి

 స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News