/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయన హాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేయాలని తన ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ హాలీవుడ్ పై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ దర్శకులు తనను వెతుక్కుంటూ రావాలని.. అంతే కానీ వారిని తను వెతుక్కుంటూ వెళ్లనని ఆయన అన్నారు. ఓంపురి, ప్రియాంక, ఇర్ఫాన్ ఖాన్ లాంటివారు హాలీవుడ్ సినిమాల్లో నటించారని.. కానీ తనకు అటువంటి అవకాశాలు ఎప్పుడూ రాలేదని షారుఖ్ పేర్కొన్నారు. బహుశా తనకు ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడడం రాదని.. అందుకే అవకాశాలు రావడం లేదని అనుకుంటున్నానని షారుఖ్ చమత్కరించారు.

అయితే హాలీవుడ్ నటులు కూడా హిందీ సినిమాల్లో నటిస్తే తనకు చూడాలని ఉందని షారుఖ్ తెలిపారు. ముఖ్యంగా టామ్ క్రూజ్ వచ్చి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని షారుఖ్ పేర్కొన్నారు. మన నటులు వెళ్లి అక్కడి దర్శకుల డైరక్షన్‌లో నటించాలని ఎందుకు అనుకోవాలి. అక్కడి నటులే ఇక్కడకు వచ్చి భారతీయ దర్శకులతో పనిచేయాలని అనుకోవచ్చు కదా. అలాంటి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను" అని షారుఖ్ తెలిపారు. 

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జీరో" చిత్రంలో నటిస్తున్నారు. తన సొంత బ్యానరైన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌‌మెంట్‌లో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, అభయ్ డియోల్ లాంటివారు నటించారు. అలాగే సల్మాన్ ఖాన్, దీపికా పడుకొనే, రాణి ముఖర్జీ, కాజోల్, అలియా భట్ మొదలైన వారు ఈ చిత్రంలో అతిధి పాత్రలలో నటించారు. 

Section: 
English Title: 
English is the main problem for me to act in Hollywood says Sharukh Khan
News Source: 
Home Title: 

షారుఖ్‌ హాలీవుడ్‌లో నటించలేదు.. ఎందుకంటే?

నాకు హాలీవుడ్ అవకాశాలు రాకపోవడానికి కారణం.. ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడమే: షారుఖ్ ఖాన్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
హాలీవుడ్ అవకాశాలు రాకపోవడానికి కారణం.. ఇంగ్లీష్ రాకపోవడమే:షారుఖ్
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 28, 2018 - 19:25