Jilebi Review: శ్రీ కమల్‌- శివాని రాజశేఖర్ నటించిన జిలేబి సినిమా రివ్యూ

శ్రీ కమల్‌- శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'జిలేబి'. స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఆయన కొడుకే ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ రోజే విడుదలైన సినిమా ఎలా ఉందంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2023, 02:37 PM IST
Jilebi Review: శ్రీ కమల్‌- శివాని రాజశేఖర్ నటించిన జిలేబి సినిమా రివ్యూ

Jilebi Movie Review: స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్. చాలా గ్యాప్ తరువాత ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీలో ఆయన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేశాడు. జిలేబి అంటూ నేడు తండ్రీకొడుకులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

కథ
జిలేబి కథ ఓ నలుగు కుర్రాళ్ల మధ్య జరుగుతుంది. కాలేజ్ చదువుకునే కుర్రాళ్లు హాస్టల్‌లో ఉంటారు. ఓ అమ్మాయి వల్ల వారి జీవితం ఎలా మారిందనేదే కథ.  కమల్ (శ్రీ కమల్) అనే కుర్రాడు.. జీఎల్‌బీ (జి లక్ష్మీ భారతి) అలియాస్ జిలేబి (శివానీ రాజశేఖర్)తో ఎలా పరిచయం జరిగింది? ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీరిద్దరి మధ్యలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) ఏం చేస్తాడు? అన్నది కథ.

నటీనటులు
విజయ్ భాస్కర్ కొడుకు శ్రీ కమల్.. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం బాగానే కష్టపడ్డాడు. పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. శివానీ రాజశేఖర్ తన ఏజ్‌కు తగ్గ పాత్రలో అందంగా కనిపించింది. నటనతో మెప్పించింది. మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన పాత్రల్లో స్నేహితులుగా కనిపించిన వారు అంతా కూడా ఆకట్టుకున్నారు.

Also Read: Baby OTT Release Date: బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  

విశ్లేషణ
విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తన మార్క్, స్టైల్‌తో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపించినా.. బాయ్స్ హాస్టల్‌లోకి హీరోయిన్ వచ్చి ఉన్న దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది.
మాటలు ఎంతో సెటైరికల్‌గా, కామెడీగా ఉంటాయి. ఫన్ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. యూత్‌కు మెచ్చేలా డిజైన్ చేసుకున్న తీరు బాగుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్‌తో సెకండాఫ్ మీద మరింతగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రథమార్దంలో పాత్రల పరిచయం వరకే ఉంచిన విజయ్ భాస్కర్ అసలు కథను రెండో భాగంలోనే చూపించాడు. హాస్టర్ వార్డెన్ రూంలను చెక్ చేసే సీన్లు నవ్వులు పుట్టిస్తాయి.

చేతబడి చేసే సీన్లు సైతం మెప్పిస్తాయి. ఆ సీన్లలో రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ, మాటలు అన్నీ కూడా సినిమాకు ప్లస్సుగా మారాయి. సాంకేతికంగానూ సినిమా బాగుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువల ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్ 2.75

Also Read: Vyooham Movie: వ్యూహంపై పెరుగుతున్న అంచనాలు, సినిమాలో పాత్రలపై సర్వత్రా ఆసక్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News