హరికృష్ణ అరుదైన ఫోటో షేర్ చేసిన క్రిష్

నందమూరి హరికృష్ణకు సంబంధించిన అరుదైన ఫోటో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి షేర్ చేశారు.

Last Updated : Aug 29, 2018, 04:02 PM IST
హరికృష్ణ అరుదైన ఫోటో షేర్ చేసిన క్రిష్

నందమూరి హరికృష్ణకు సంబంధించిన అరుదైన ఫోటో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి షేర్ చేశారు. బుధవారం నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణకు క్రిష్ నివాళులర్పించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముందు హరికృష్ణ నడుస్తూ ఈ ఫొటోలో కనిపించారు. 'మార్పుకోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్యరథసారథ్యం.. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం'అంటూ క్రిష్ పేర్కొన్నారు. 1962లోనే దేశ రక్షణ కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరిస్తున్న సమయంలో హరికృష్ణ ముందు నడిచారని క్రిష్ తెలిపారు.

క్రిష్‌ ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్రం ‘యన్టీఆర్‌’ను తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ ప్రచార రథసారథిగా హరికృష్ణ తండ్రి వెంటే ఉన్నారు. హరికృష్ణ పాత్ర కూడా ‘యన్టీఆర్‌’లో చూపించనున్నారు. ఈ పాత్రలో కల్యాణ్‌రామ్‌ నటిస్తున్నారని ప్రచారంలో ఉన్నా.. మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

 

Trending News