VIDEO: చిన్నబాలుడితో క్రికెట్ ఆడిన ధోని..!

ఐపీఎల్ 2018 సీజన్ వచ్చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై జట్టు ప్రాక్టీసులో పాల్గొంది. 

Last Updated : Mar 25, 2018, 08:09 PM IST
VIDEO: చిన్నబాలుడితో క్రికెట్ ఆడిన ధోని..!

ఐపీఎల్ 2018 సీజన్ వచ్చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై జట్టు ప్రాక్టీసులో పాల్గొంది. ఈ సందర్భంగా అప్పుడప్పుడు టీమ్ ఆటగాళ్లు  ఆటవిడుపుగా తమ ఫ్యాన్స్‌‌తో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ముచ్చటిస్తున్నారు కూడా. ఇటీవలే అలాగే తనను కలవడానికి వచ్చిన ఓ చిట్టి అభిమానితో ధోని సరదాగా కొద్ది క్షణాలు గడిపాడు. తన చేతిని బాలుడి ముందు పెట్టి.. తాకమని చెప్పాడు.

ఆ బాలుడు పదే పదే విఫలమవ్వడంతో తానే సరెండర్ అయిపోయి చేతిని తాకించాడు. ఆ పిల్లాడు ధోని చేతి మీద కొట్టగానే.. దెబ్బ గట్టిగా తగిలిందని ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. చిన్నపిల్లాడితో కలిసి తాను కూడా చిన్నపిల్లాడిగా మారి ఆడిన ఈ ఆటను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ప్రస్తుతం ఈ పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2018 ప్రారంభమయ్యాక, ముంబయి వాంఖడే స్టేడియలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి

Trending News