62 ఏళ్ల ఆ బామ్మ.. దేశంలోనే అతి పెద్ద గ్యాంగ్‌స్టర్

చూడడానికి ఏమీ తెలియని అమాయకురాలి మాదిరిగా కనిపిస్తుంది. పైగా ముసలావిడ. అందుకే ఆమెపై సాధారణంగా ఎవరీ అనుమానం రాదు. కానీ ఆమెపై భారతదేశంలో 113 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 

Last Updated : Aug 20, 2018, 12:23 PM IST
62 ఏళ్ల ఆ బామ్మ.. దేశంలోనే అతి పెద్ద గ్యాంగ్‌స్టర్

చూడడానికి ఏమీ తెలియని అమాయకురాలి మాదిరిగా కనిపిస్తుంది. పైగా ముసలావిడ. అందుకే ఆమెపై సాధారణంగా ఎవరీ అనుమానం రాదు. కానీ ఆమెపై భారతదేశంలో 113 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నో మాఫియా ముఠాలు ఈ ముసలావిడ వద్ద పనిచేస్తున్నాయి. ఎందరినో మర్డర్లు చేయించిన నేపథ్యం ఈవిడది. గత 8 నెలలుగా ఈమెను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు నానా తంటాలు పడ్డారు. కానీ ఈ రోజు చాకచక్యంగా సంగమ్ విహార్ ప్రాంతంలో బంధువుల ఇంటికి వచ్చిన ఈమెను మాటువేసి పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. 62 ఏళ్ల బషీరన్ కుటుంబంలో అందరూ నేరస్తులే. ఆమెకు ఆరుగురు మగపిల్లలు. ఆ ఆరుగురుది ఒకటే ఉద్యోగం. దొంగతనాలు, దోపిడీలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ మర్డర్లు చేయడం వీరు విధిగా చేసే పనులు. గత 45 సంవత్సరాలుగా ఈ మాఫియా సామ్రాజ్యాన్ని ఒక్కర్తే అధినేతగా ఉండి నిర్వహిస్తోంది బషీరన్. క్రైమ్ వరల్డ్‌లో ఈమెను "మమ్మీ" అని ముద్దుగా పిలుచుకుంటారట. మమ్మీ గ్యాంగ్ వస్తుందంటే చాలామంది వ్యాపారస్తులకు హడలుగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. 

45 సంవత్సరాల నుండీ ఇదే దందా చేస్తూ గ్యాంగ్స్‌ను పెంచిపోషిస్తున్న బషీరన్ తొలుత మురికివాడల్లో దొంగ సారా అమ్ముతూ పట్టుబడింది. ఆ తర్వాత వివిధ నేరాలు చేస్తూ.. ఆఖరికి సుపారీలు తీసుకొని మర్డర్లు కూడా చేయడం మొదలుపెట్టింది. తన పిల్లలకు కూడా మర్డర్లు చేయడం నేర్పించింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో మిరాజ్ అనే వ్యక్తిని చంపడం కోసం రూ.60,000కు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈమె గ్యాంగ్ సభ్యులు తొలుత మిరాజ్‌తో పరిచయం పెంచుకొని.. ఆ తర్వాత స్నేహితులుగా మారి ఆ తర్వాత మందుపార్టీకని పిలిచి హత్య చేశారు. తర్వాత శవాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశారు. అప్పుడే యూపీ పోలీసులకు అనుమానితుల జాబితాలో బషీరన్ వివరాలు దొరికాయి. తర్వాత తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు.. ఆమె పై నిఘా పెడితే.. ఆమె మమ్మీ గ్యాంగ్ అనే గ్యాంగ్ నడుపుతుందని.. ఇప్పటికి 113 కేసులు ఆమెపై ఉత్తరాదిలో వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయని తెలుసుకొని విస్తుపోవడం పోలీసుల వంతైంది.

Trending News