రజినీకాంత్ ఫ్యాన్స్ కు కిక్కిస్తున్న 'దర్బార్' సాంగ్ ప్రోమో

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'దర్బార్'. ఈ సినిమా ట్రెయిలర్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దుమ్మురేపుతోంది.  జనవరి 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే సన్నాహాలు చేశారు.

Last Updated : Dec 30, 2019, 11:37 AM IST
రజినీకాంత్ ఫ్యాన్స్ కు కిక్కిస్తున్న  'దర్బార్' సాంగ్ ప్రోమో

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'దర్బార్'. ఇప్పటికే 'దర్బార్' ట్రెయిలర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దుమ్మురేపుతోంది. జనవరి 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే సన్నాహాలు చేశారు. ఐతే ఆ లోగా  తలైవా  అభిమానులను అలరించేందుకు దర్బార్ సినిమా నుంచి మరో పాట ప్రోమోను విడుదల చేశారు. ఇది తలైవా అభిమానులకు కిక్కిస్తోంది. సినిమా విడుదల కోసం సూపర్ స్టార్  ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో పాట ప్రోమో విడుదల కావడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు.

ముంబై నేపథ్యంలో..

ముంబైలో పోలీస్ కమిషనర్ పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం ముంబై మాఫియా పని ఎలా పట్టాడనే ఇతివృత్తంతో సినిమా రూపొందింది. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 'పేట' సినిమా ఫ్లాప్ గా నిలిచిపోవడంతో .. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News