Curry Leaves Tea For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బాధపడుతున్న అనారోగ్య సమస్యల్లో మధుమేహం సమస్య ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు మన దేశంలో జీవిస్తున్న ఒక్కొక్క కుటుంబాల్లో ఒక్కరైనా ఉంటారంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం షుగర్ వ్యాధి ఓ సర్వసాధారణ సమస్యగా మారిందని ఆరోగ్యంగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్యతో పోలిస్తే.. భారత్ లోనే ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువని ఇటీవల నివేదికలు పేర్కొన్నారు. క్లోమ గ్రంధిలో మార్పులు సంభవించడం వల్ల ఈ తీవ్ర వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రంధి పనిచేయక పోవడానికి ప్రధాన కారణాలు మానసిక ఒత్తిడి, జీవనశైలి మారడం, ఆహార పలవాట్లు మారడం వంటి తీవ్ర మార్పుల వల్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహాన్ని నియంత్రించేందుకు జీవన శైలిలో మార్పులు ఆహార అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకుంటే.. సులభంగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కర్వేపాకుతో తయారు చేసిన టీ ని ప్రతిరోజు తాగిన సులభంగా ఉపశమనం పొందుతారు. ఈటీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ టీని తయారు చేసుకునే పద్ధతి:
ఆరోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడేందుకు కరివేపాకు టీ ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా మూడు రెమ్మల కరివేపాకును తీసుకోవాలి. మొదట స్టవ్ వెలిగించి.. ఓ బౌల్ పెట్టి అందులో రెండు కప్పుల నీటిని వేసి.. అందులో ఈ కరివేపాకును వేయాలి. ఆ తర్వాత అందులో ఒక టీ స్పూన్ మెంతి గింజలను వేయాలి. ఇలా వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఇందులో అల్లం ముక్కలను వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన టీ లో రుచికి సరిపడా తేనెను వేసుకొని.. ఈరోజు రెండు పూటలా ఈ టీ ని తాగితే మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది.
Also Read: Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్ కోసం ఇలానా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook