రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చిన చిరంజీవి

రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చిన చిరంజీవి

Last Updated : May 5, 2019, 01:32 PM IST
రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చిన చిరంజీవి

దర్శకరత్న దాసరి నారాయణ రావుని స్మరించుకుంటూ ఆయన పుట్టిన రోజైన మే 4వ తేదీని ప్రతీ సంవత్సరం టాలీవుడ్ దర్శకుల దినోత్సవంగా జరుపుకోవాలని తెలుగు సినీపరిశ్రమ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీపరిశ్రమకు చెందిన దర్శకుల సంఘం ఇకపై మే 4వ తేదీని టాలీవుడ్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నిన్న శనివారం హైదరాబాద్‌లో టాలీవుడ్ దర్శకులు దర్శకుల దినోత్సవ వేడుకగా జరుపుకున్నారు. 

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి దాసరి నారాయణ రావు మీద వున్న గౌరవం, అభిమానంతో దర్శకుల సంఘానికి రూ 25 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. దాసరి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని ఈ సందర్భంగా చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు.

Trending News