సినీ నటి, బీజేపి యువ నాయకురాలు మాధవీలతపై ( Madhavi latha ) వనస్థలిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించే మాధవీలతకు అదే సోషల్ మీడియా తెచ్చిన తంటా ఇది. ఫేస్బుక్లో హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో మాధవీలత ఓ పోస్ట్ పెట్టారంటూ వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఆమెపై పోలీసులకు పిర్యాదు చేశారు. గోపీకృష్ణ ఫిర్యాదు మేరకు మాధవీలతపై సోమవారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తనపై వచ్చే ఆరోపణలపై ఎప్పుడైనా ఘాటుగానే స్పందించే మాధవీ లత ఈ విషయంలో ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి. Also read : Prabhas: ప్రభాస్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీ ఇదేనా ?
ఇదిలావుంటే, ఇటీవల కత్తి మహేష్ కూడా ఇదే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఓ ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన నేరం కింద అరెస్ట్ అవగా నాంపల్లి కోర్టు ఆయనను 14 రోజుల పాటు రిమాండ్‌కి పంపించిన సంగతి తెలిసిందే. Also read : Kajal Aggarwal: కాజల్ ఎంగేజ్మెంట్ వార్తల్లో నిజమెంత ?