Bigg Boss Satya : బిగ్ బాస్ దెబ్బకు మాడిపోయింది.. అసలు రూపం బయటపడింది.. తెల్లమొహమేసిన సత్య

Bigg Boss 6 Telugu 12th week Nominations బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారంలో నామినేషన్స్ సీక్రెట్‌గా జరిగాయి. కన్‌ఫెషన్ రూంలో జరగడంతో అందరూ తమ తమ మనసుల్లో ఇన్ని రోజులు ఉన్న కోపాన్ని, బాధను బయటపెట్టేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 09:33 AM IST
  • పన్నెండో వారంలో సీక్రెట్ నామినేషన్స్
  • కీర్తి, రేవంత్‌లు తప్పా అందరూ నామినేషన్‌లోనే
  • సత్యకు మొట్టికాయలు వేసిన బిగ్ బాస్
Bigg Boss Satya : బిగ్ బాస్ దెబ్బకు మాడిపోయింది.. అసలు రూపం బయటపడింది.. తెల్లమొహమేసిన సత్య

Bigg Boss Satya in 12th week Nominations : బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ల సమయంలోనే అసలు రంగులు బయటపడతాయి. ఎవరి తెలివి ఎంత ఉంది.. ఎవరెవరు ఎలా ఆలోచిస్తుంటారు.. ఎదుటి వారిలో ఏం చేస్తున్నారు.. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది బయటపడుతుంది. సిల్లీ రీజన్లతో నామినేట్ చేసే వారిని, కక్ష కట్టి నామినేట్ చేసే వారిని జనాలు చూస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు జనాల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

ఇక నిన్న జరిగిన పన్నెండో వారం నామినేషన్స్ సీక్రెట్‌గా కన్ ఫెషన్ రూంలో జరిగాయి. దీంతో కంటెస్టెంట్లంతా కూడా తమ తమ అభిప్రాయాలను స్వేచ్చగా బయటపెట్టేశారు. శ్రీ సత్య అయితే తన పిచ్చి, సిల్లీ కారణాలతో బిగ్ బాస్ చేత వార్నింగ్ ఇప్పించుకుంది. రోహిత్, రాజ్‌లను శ్రీ సత్య నామినేట్ చేసింది. ఆ నామినేషన్‌కు చెప్పిన రీజన్స్ చూస్తే.. ఆమె ఆట తీరు, ఆమె బుర్ర ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. రోహిత్ గత వారంలో టాస్కులో ఎఫ్ అనే వర్డ్ వాడాడట.. అందుకే రోహిత్‌ను నామినేట్ చేసిందట.

అయితే శ్రీ సత్య మాట్లాడిన మాటలకు, వేసిన బీప్‌లకు, చేసిన చేష్టలకు జనాలు ఆమెను ఎప్పుడో ఎలిమినేట్ చేయాలి. కానీ బిగ్ బాస్ టీం ఆమెను కాపాడుతోందని అర్థమవుతోంది. అలాంటి సత్య.. ఇప్పుడు ఎఫ్ అనే పదాన్ని రోహిత్ వాడాడంటూ నామినేట్ చేయడం కామెడీగా ఉంది. అది పక్కన పెడితే.. రాజ్ విషయంలో చెప్పిన కారణంకు బిగ్ బాస్‌కి కూడా మండినట్టుంది. రాజ్ గత మూడు వారాలుగా నామినేట్ అవుతూనే ఉన్నాడని, అందుకే నామినేట్ చేస్తున్నానని సత్య అనేసింది.

సరైన కారణం చెప్పు అని మళ్లీ సత్యను కూర్చోబెట్టాడు బిగ్ బాస్. దీంతో సత్య మళ్లీ ఒక కారణాన్ని వెతికింది. లాస్ట్ వీక్‌లో రాజ్ ఆట నాకు ఎక్కువగా కనిపించలేదంటూ ఏదో ఒక పిచ్చి కారణం చెప్పింది సత్య. అలా మాట మార్చిన సత్యను జనాలు చీ కొడుతున్నారు. అసలే శ్రీహాన్ సత్య ట్రాక్ మీద జనాలు విపరీతంగా నెగెటివిటీతో ఉన్నారు. ఈ వారం సత్య ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలే ఉన్నాయి.

Also Read : Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్‌ కోసం ఇలానా?

Also Read : Allu Arjun Allu Arha Cute Video : కందిరీగలు కుడుతున్నాయ్ అంట.. బన్నీతో అర్హ ముద్దు ముద్దు ముచ్చట్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News