Green India Challengeను స్వీకరించిన ప్రభాస్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0లో భాగంగా బాహుబలి స్టార్  ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అంగీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయడానికి సహకరించిన అభిమానులను ప్రశంసించారు.

Last Updated : Jun 11, 2020, 10:10 PM IST
Green India Challengeను స్వీకరించిన ప్రభాస్..

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0లో భాగంగా బాహుబలి స్టార్  ప్రభాస్ (Green India Challange) గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అంగీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయడానికి సహకరించిన అభిమానులను ప్రశంసించారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ సెలబ్రిటీలకు ఇష్టమైన చాలెంజ్ గా మారిపోయింది. కరోనా కాలంలోనూ ఇది కొనసాగడం విశేషం. తాజాగా ఈ చాలెంజ్ లో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కూడా పాల్గొన్నారు. 

Also Read:  Gandhi hospital: గాంధీలో కరోనా పేషెంట్ డెడ్‌బాడీ మిస్సింగ్

 

ఈ కార్యక్రమానికి ఆద్యుడైన ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కు ధరించిన ప్రభాస్, సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతరం ఓ సెల్ఫీతో ముగించారు. ఇదిలాఉంటే ప్రభాస్ అభిమానులు తన 20వ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే  ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ చిత్రం పాటల చిత్రీకరణ జార్జియాలో చిత్రీకరించారు. కరోనావైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News