భారత పైలట్ నిర్బంధంపై అసదుద్దీన్ రియాక్షన్

                                     

Last Updated : Feb 27, 2019, 06:21 PM IST
భారత పైలట్ నిర్బంధంపై అసదుద్దీన్ రియాక్షన్

భారత్ యుద్ధ పైలట్ అభినందన్ తమ కస్టడీలో ఉన్న వీడియోను పాక్ విడుదల చేయడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి చేస్తూ తీసుకెళ్తున్న ఘటన విషాదకరంగా కనిపిస్తోంది. యుద్ధ ఖైదీల విషయంలో పాటించాల్సిన కనీస నియమాలను కూడా పాక్ ఉల్లంఘిస్తోంది. అయితే అంతటి గడ్డపరిస్థితుల్లో అభినందన్ ధైర్యంగా ఉన్నట్లు కనిపించడం గమనార్హం

అభినందన్ క్షేమ సమాచారం కోసం దేశమంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఆ వీర పైలట్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కష్టకాలంలో ఉన్న మన భారత పైలట్  కోసం తాము ప్రార్థిస్తున్నామన్నారు. ఇండో పాక్ సరిహద్దుల్లో నెలకొకన్న పరిణామాలను పక్కన పెట్టి పైలట్ విషయంలో పాకిస్థాన్ మానవత్వంతో మెలగాలని కోరుతున్నామని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

Trending News