Alia Bhatt Baby Shower : అలియా భట్ సీమంతం వేడుకలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్

Alia Bhatt Baby Shower Event Pics అలియా భట్ సీమంతం వేడుకలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. పసుపు డ్రెస్సులో అలియా భట్ ఎంతో అందంగా, నవ్వుతూ, హాయిగా ఉన్నట్టు కనిపించింది. అలియా రణ్‌బీర్ కపూర్ జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 02:36 PM IST
  • నెట్టింట్టో అలియా భట్ సందడి
  • బేబీ బంప్‌తొ అలియా హల్చల్
  • అలియా సీమంతం వేడుకలు
Alia Bhatt Baby Shower : అలియా భట్ సీమంతం వేడుకలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్

Alia Bhatt Baby Shower :  అలియా భట్ త్వరలోనే తల్లి కాబోతోంది. తాను తల్లిని కాబోతోన్నాను, తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ కూడా అలియా భట్ ప్రకటించలేదు. అయితే పెళ్లికి ముందే అలియా ప్రెగ్నెంట్ అన్న రూమర్లు కూడా వచ్చాయి. అందుకే పెళ్లి కూడా చాలా హడావిడిగా, బంధు మిత్రుల సమక్షంలో జరిపించారని అంటారు. ఆ మధ్య  అలియా ఓ పోస్ట్ వేస్తూ..  అధికారికంగా తాను తల్లిని అవుతున్నానని చెప్పింది.

అలియా భట్ రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ కూడా బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్ కోసం చాలా తిరిగారు. ఆ సమయంలోనే అలియా భట్ బేబీ బంప్ కనిపించింది. దీనిపై తెగ చర్చ జరిగింది. అలియా కూడా కాస్త వదులైన దుస్తులే ధరిస్తూ వచ్చింది. ప్రెగ్నెంట్ అయినా కూడా అలియా భట్ బ్రహ్మస్త్ర మూవీ కోసం తెగ తిరిగింది.

హైద్రాబాద్‌లో ప్రమోషన్స్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రెగ్నెన్నీగురించి  స్పందించారు. సుమ క్యాష్‌ షోలో, బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున కూడా.. అలియా ప్రెగ్నెంట్ గురించి స్పందించారు. పండంటి బిడ్డ పుట్టాలని నాగార్జున ఆశీర్వదించాడు. అలా ప్రెగ్నెన్సీ గురించి అలియా నోరు విప్పాల్సి వచ్చింది.

తాజాగా అలియా భట్ ఇంట్లో సీమంతం వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇది బేబీ షవర్ ఈవెంట్ అని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ అలియా భట్ రణ్‌బీర్ కపూర్ ఫోటోలను చూస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతోంది. ఇంట్లో అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరిగింది. జస్ట్ లవ్ అనే క్యాప్షన్ పెట్టేసింది.

అలియా భట్ జూన్ 27న తన పాప రాబోతోందంటూ ఓ ప్రకటన చేసింది. అంతే అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు ఒక్క పోస్ట్ కూడా తన బిడ్డ గురించి, బేబీ బంప్ గురించి కానీ పోస్ట్ వేయలేదు. అలియా భట్ బయట కనిపించినప్పుడు మాత్రం బేబీ బంప్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతుండేవి.

ఏప్రిల్ 14న అలియా భట్ రణ్ బీర్ కపూర్‌లకు వివాహాం జరిగిన సంగతి తెలిసిందే. అలియా పర్సనల్ లైఫ్ ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. ఆర్ఆర్ఆర్, బ్రహ్మస్త్ర, గంగూభాయ్ చిత్రాలతో అలియా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. ఇప్పుడు అయితే సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read : Shivatmika Sizzling Photos: రాజశేఖర్ చిన్న కూతురు పరువాల విందు.. ఎక్కడా తగ్గట్లేదుగా?

Also Read: Neha Sharma Hot Photos: బెడ్ మీద రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ.. లోదుస్తులు కనిపించేలా హాట్ షో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News