Actors remunerations cut: సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

సినిమా ఇండస్ట్రీలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మూతబడిన థియేటర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో తెరచుకోనున్నాయి ( Cinema halls to reopen). కరోనావైరస్ సంక్రమణకు ముందు నటీనటులు ఒప్పందం చేసుకున్న వేతానాలకు ( Artistes remunerations ) ఈ 20 శాతం కోత వర్తిస్తుంది.

Last Updated : Oct 4, 2020, 06:48 PM IST
Actors remunerations cut: సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

సినిమా ఇండస్ట్రీలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మూతబడిన థియేటర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో తెరచుకోనున్నాయి ( Cinema halls to reopen). కాని 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడిపించాలని, థియేటర్లు శానిటైజ్ చేసి, కరోనా నిబందనలును ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశించింది.

కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus crisis ) కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో పడిందని, దాని నుండి కోలుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని భావించిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ( The Active Telugu Film Producers’ Guild ) అక్టోబర్ 3న సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంది. నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంగీకారంతో నటీనటుల వేతనాల నుండి 20 శాతం కోత విధించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రస్తుతం సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాతల ప్రతిపాదనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( MAA Association  ) కూడా అంగీకరించింది. Also read : RRR movie shooting: క్వారంటైన్‌లో ఎన్టీఆర్, రాంచరణ్ ?

రోజుకు రూ. 20,000 లోపు వేతనం తీసుకునే నటీనటులకు ఈ కోత నుండి మినహాయింపు ఉంటుంది. ఒక సినిమాకి రూ. 5 లక్షలకు పైగా వేతనంగా డ్రా చేస్తున్న సాంకేతిక నిపుణులకు కూడా 20 శాతం కోత వర్తిస్తుంది.

కరోనావైరస్ సంక్రమణకు ముందు నటీనటులు ఒప్పందం చేసుకున్న వేతానాలకు ( Artistes remunerations ) ఈ 20 శాతం కోత వర్తిస్తుంది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( Movie Artistes Association ) కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. Also read : Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News